జార్జి రెడ్డి స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాటాలకు సిద్ధం కండి
పిడిఎస్యు రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఆలూరు రాఘవ, గౌరవ సలహాదారు కె.వి చౌదరి, ఉప కోశాధికారి రాయపనేని హరికృష్ణ పిలుపు
ఐఎఫ్టియు కార్యాలయంలో పిడిఎస్యు 24వ రాష్ట్ర మహాసభల లోగో, కరపత్రాల ఆవిష్కరణ
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిర్మాతల్లో ఒకరైన చల్లా జార్జిరెడ్డి ఉద్యమస్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని పిడిఎస్యు రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ ఆలూరు రాఘవ, గౌరవ సలహాదారు- ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు కె.వి చౌదరి, ఉప కోశాధికారి, ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. 2027 జనవరి 5, 6, 7 తేదీలలో తిరుపతిలో జరగనున్న పిడిఎస్యు 24వ రాష్ట్ర మహాసభల లోగోను అలాగే కరపత్రాలను సోమవారం తిరుపతి నారాయణపురం లోని ఐఎఫ్టియు కార్యాలయంలో వక్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ విజ్ఞానాన్ని అందించే నాణ్యమైన విద్యకోసం పోరాడి మతోన్మాదుల చేతిలో జార్జి రెడ్డి దారుణ హత్యకు గురయ్యారని చెప్పారు. నేడు విద్య పేదవాడికి భారంగా మారిందన్నారు. రాజ్యాంగంలో నిర్బంధ విద్య ఉన్నా అమలు కావడం లేదని తమ పిల్లలను చదివించుకోవడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతోందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ చేతుల్లో వెళ్ళిపోయిన విద్య ధనవంతులకే అందుబాటులో ఉందని, లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టినా నాణ్యమైన విద్యను పొందలేని పరిస్థితి నేడు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్య రంగానికి కేటాయిస్తున్న నిధుల శాతాన్ని కూడా తగ్గించేస్తున్నాయని ఇది పాలకుల నిర్లక్ష్యానికి అర్థం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగంలో రోజురోజుకు పెరుగుతున్న సమస్యలపై పిడిఎస్యు రాజీలేని పోరాటాలు చేస్తోందని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకోవడానికి అవస్థలు పడుతున్నారని నేడు వారు కూడా చైతన్యవంతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పోరాట యోధుడు జార్జిరెడ్డి మన చిత్తూరు జిల్లా పీలేరు దగ్గర ఉన్న చల్లావారి పాలెం నివాసి కావడం ఆనందంగా ఉందన్నారు. జనవరి 5, 6, 7 తేదీలలో జరగనున్న పిడిఎస్యు 24వ రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఇందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పాటూరి వెంకటరత్నం, ఏఐకేఎంఎస్ నాయకులు ఆర్. వెంకయ్య, PDSU తిరుపతి జిల్లా అధ్యక్షుడు. ఆహ్వాన సంఘం కోశాధికారి. ఎస్ .జాకీర్, aikms జిల్లా ప్రధాన కార్యదర్శి డి అరుణాచలం ,ఆటో యూనియన్ నాయకుడు కుడుం విజయ్ కుమార్, అంగన్వాడి కార్యదర్శి నాగరత్న, అధ్యక్షురాలు సుజాత, నాయకురాలు జే.గంగాదేవి, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు లక్ష్మీ కళ, కవిత, రేఖ. నిర్మల. న్యాయవాది ఉషాకిరణ్, రిటైర్డ్ డిఎస్పీ కరుణాకర్, ఐఎఫ్టియు నాయకులు ఇమ్రాన్, మనోహర్. PDSU నాయకులు జిల్లా సహాయ కార్యదర్శి k. ప్రసాద్. మోహిత్. అనూష. శ్రీను. అబ్బు తదితరులు పాల్గొన్నారు.

More Stories
पटना बिहार*मोकामा विधायक अनंत सिंह ने अपनी बेटी की शादी में बिहार समेत पूरे देश को न्योता दिया
चित्रकूट 23 नवम्बर 26*🚨 चित्रकूट में नशेड़ी ट्रक चालक का सड़क पर तांडव!
नई दिल्ली 23 नवम्बर 26*पीएम मोदी ने नेपाल के पीएम बालेन शाह को दिया त्रिवेणी का गंगाजल, बदले में मिला पशुपतिनाथ का रुद्राक्ष-चंदन*